మలింగ, పతిరాణా పనికిరారు.. ఇదేం బౌలింగ్ యాక్షన్ బాబు..?
క్రికెట్లో బౌలింగ్ వేసేటప్పుడు ఒక్కొక్క బౌలర్‌ది ఒక్కో శైలి. లాంగ్ రన్ తీసుకుని బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు అయినా.. తక్కువ రనప్‌తో వేసే స్పిన్నర్లు అయినా ఎవరికి వాళ్లదే ప్రత్యేకమైన శైలి. నిన్నటి మలింగ నుంచి నేటి బుమ్రా, మతీషా పతిరాణా (శ్రీలంక) వరకు ఈ విషయంలో ఎవరి గొప్పతనం వారిదే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బౌలర్ బౌలింగ్ శైలి మాత్రం చిత్ర విచిత్రమైనది.
తాజాగా ఒక బౌలర్.. మలింగ, బుమ్రా, పతిరాణాల్నే కాదు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బౌలింగ్ చేశాడు. బాల్ వేయడానికి నిల్చున్న చోటు నుంచి బంతి విసిరే వరకు బాల్‌ను పట్టుకున్న చేతిని తింపుతూనే ఉన్నాడు. కుడిచేతిని తిప్పుతూ.. బంతిని విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెట్టింట్లో వైరల్ అయిన వీడియో లో బౌలింగ్ చేసిన బౌలర్, ఇతరత్రా వివరాలు తెలియరాలేదు. కానీ అతడి బౌలింగ్ శైలి చూస్తే మాత్రం లగాన్ సినిమా గుర్తుకు రాక మానదు. ఆ సినిమాలో గోలీ అనే పాత్రలో నటించిన దయా శంకర్ పాండే బౌలింగ్ గుర్తుందా..? రనప్ మొదలు బంతిని విసిరేవరకూ చేతిని గుండ్రంగా తిప్పుతూ బౌలింగ్ చేస్తాడు. అప్పుడు అదేదో సినిమా కోసం అనుకున్నాం గానీ ఇప్పుడు ఇది మాత్రం రియాలిటీ. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్లో వైరల్‌గా మారింది.
This puts @alricho21 double twirl to shame. Love it! pic.twitter.com/EHfLvOo9sc
— Charles Dagnall (@CharlesDagnall) June 6, 2022
ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మోయినక్ దాస్ అనే ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ..‘బుమ్రా, పతిరణా, మలింగలను పక్కనబెట్టండి. ఇదిగో, బౌలింగ్ యాక్షన్‌లో మనకో గొప్ప బౌలర్ దొరికాడు..’ అని రాసుకొచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ కూడా ఈ వీడియోకు స్పందిస్తూ.. ‘ప్రాపర్ యాక్షన్’ అని ట్వీట్ చేశాడు. ఈ విచిత్రమైన బౌలింగ్ శైలి ఉన్న బౌలర్ విన్యాసాలు మీరూ చూసేయండి మరి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

