Border – Gavaskar Trophy : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. దాంతో, నిప్పులు చెరిగే ఆసీస్ పేస్ దళాన్ని భారత బ్యాటింగ్ లైనప్ ఎలా ఎదుర్కొంటుంది? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే.. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ఎంత కష్టమో ఆసీస్‌కు అనుభవమే. 2017లో ఇండియా పర్యటనకు వచ్చిన ఆ జట్టు 2-1తో సిరీస్ కోల్పోయింది.
ఈ రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో ఆ సిరీస్‌లో చూశాం. త్వరలోనే బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ప్రారంభం కానున్నందున 2017 సిరీస్ వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసినప్పుడు ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ రియాక్షన్ చూసి తీరాల్సిందే. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా, భారత పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మొదలవుతుంది.
Best moments of Border-Gavaskar Trophy (BGT) 2017. pic.twitter.com/lc0J6Mpfxc
— Samar (inactive) (@unbeaten82) January 30, 2023