Border – Gavaskar Trophy : భారత్ పర్యటనలో గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా జట్టు సన్నాహాలు మొదలుపెట్టింది. టీమిండియా సీనియర్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవడం కోసం కొత్త ఎత్తుగడ వేసింది. నెట్ ప్రాక్టీస్ కోసం అచ్చం అతనిలా ఆఫ్ స్పిన్ వేసే భారత స్పిన్నర్‌ను తీసుకుంది. ఇంతకు అతను ఎవరంటే… మహేష్ పిథియా. 21 ఏళ్ల ఈ స్పిన్నర్ పోయిన ఏడాది డిసెంబర్లో బరోడా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరంగ్రేటం చేశాడు. సోషల్‌మీడియా వీడియో ద్వారా ఇతను ఆసీస్ సహాయక సిబ్బంది దృష్టిలో పడ్డాడు. మహేష్ బౌలింగ్ యాక్షన్ చూసిన ఆసీస్ జట్టు సహాయక సిబ్బంది వెంటనే అతడిని సంప్రదించారు. ఆసీస్ బ్యాటర్లు నెట్స్‌లో అతని బౌలింగ్‌ను ఎదుర్కొంటూ అశ్విన్‌ను అడ్డుకోవడం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఆ జట్టు స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మహేష్ బౌలింగ్‌లో షాట్లు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వదేశంలో ఓడించాలని
రెండేళ్ల క్రితం సొంత గడ్డపై టీమిండియా చేతిలో ఆసీస్ టెస్టు సిరీస్ కోల్పోయింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ విధ్యంసక బ్యాటింగ్‌తో భారత్ టెస్ట్ సీరస్ గెలుచుకుంది. 2020లోనూ ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలవలేదు. ఆశ్విన్ బౌలింగ్‌లో ఆడేందుకు ఆసీస్ బ్యాటర్లు తిప్పలు పడ్డారు. 4 మ్యాచుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ 14 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ కొట్టాడు. దాంతో, ఈసారి అశ్విన్‌ను ధాటిగా ఎదుర్కోవాలని ప్యాట్ కమిన్స్ బృందం భావిస్తోంది. అంతేకాదు ఇండియాను స్వదేశంలో ఓడించాలని కసితో ఉంది.
ఫిబ్రవరి 9న తొలి టెస్టు
భారత పర్యటనలో ఆసీస్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న మొదలు కానుంది. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఉన్నందున ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఈ సిరీస్ విజయం చాలా ముఖ్యం. ఇప్పటికే ఆసీస్ 75.56 పాయింట్లతో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇండియా 58.93 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఐసీసీ 2021లో తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది.
Mahesh Pithiya grew up being called “Ashwin” owing to his uncanny impersonation of his idol @ashwinravi99 & he ended up ‘playing’ Ashwin for Australia in their first training session on tour & making a big impression on Steve Smith. Here’s how #IndvAus https://t.co/GnAd63DFN6 pic.twitter.com/BgNwOWGDC6
— Bharat Sundaresan (@beastieboy07) February 3, 2023