టురిన్ (ఇటలీ): భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ ద్వయం అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్‌ను ఓటమితో ఆరంభించింది. టురిన్లో జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్ దశలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-ఎబ్డెన్ జోడీ.. 2-6, 3-6తో సిమోన్ బొలెల్లి-ఆండ్రియా వవసురి (ఇటలీ) చేతిలో పరాభవం ఎదుర్కొంది. మ్యాచ్‌లో ఇండో ఆస్ట్రేలియా జంట చేసిన రెండు డబుల్ ఫాల్ట్స్‌కు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఈ టోర్నీ తర్వాతి మ్యాచ్‌లో వాళ్లిద్దరూ.. బుధవారం మార్సెలో అరెవలో(ఎల్ సాల్వెడర్)-మేట్ పావిస్ (క్రొయేషియా)తో అమీతుమీ తేల్చుకోనున్నారు.