Padma Vibhushan : దివంగత రెజ్లర్ ఖాషాబా దాదాసాహెబ్ జాధవ్ (Khashaba Dadasaheb Jadhav)కు ‘పద్మ విభూషణ్’ (Padma Vibhushan) పురస్కారం ఆలస్యంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్తీ పోటీల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత పతకం సాధించిన జాధవ్‌కు ఇప్పటికీ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించకపోవడంతో మండిపడిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. మరణాంతరం ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వడంపై మే 4వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేసింది ధర్మాసనం.
కుస్తీ వీరుడైన ఖాషాబా దాదాసాహెబ్ జాధవ్ 1952 హెల్సింకీలో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందాడు. ఈ పోటీల్లో దేశానికి తొలి వ్యక్తిగత మెడల్ అందించిన ఆయన 1984లో మరణించాడు. కేంద్రం ఆయనకు 2001లో ‘అర్జున’ అవార్డు ప్రకటించింది. అనంతరం జాధవ్ సేవల్ని గుర్తించి పద్మ విభూషణ్ ఇవ్వాలని ఆయన కుటుంబం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది. అయితే.. కేంద్రం నుంచి స్పందన కరువవ్వడంతో కుస్తీవీర్ ఖషాబా జాదవ్ సంస్థ బాంబే హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
Decide on posthumous Padma Vibhushan for KD Jadhav by May 4: High Court to Centre
Wrestler #KhashabaJadhav, who passed away in 1984, had won the bronze medal in the #Helsinki #OlympicGames held in 1952. He was awarded the Arjuna Award posthumously in 2001.
Read in detail:… pic.twitter.com/F4aL1PV5iE— IndiaToday (@IndiaToday) April 20, 2026
మరణాంతరం జాధవ్‌కు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలనే విషయాన్ని పరిగణించాల్సిందిగా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని పిల్లో విజ్ఞప్తి చేసిందా సంస్థ. ఈ పిల్‌పై విచారణన చేపట్టిన జస్టిస్ మాధవ్ జమ్దార్, జస్టిస్ ప్రవీణ్ పాటిల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 15న ఉత్తర్వులు జారీ చేసింది.. మహారాష్ట్రకు చెందిన జాధవ్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పతకం గెలిచిన తొలి వ్యక్తి అనడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా పేర్కొంది.
LEGEND OF INDIAN WRESTLING 🤼
Khashaba Dadasaheb Jadhav Sir
– Bronze Medalist in 1952 HelsinkiFirst athlete from Independent India to win an individual medal in the Olympics 🇮🇳🫡 pic.twitter.com/JIkoW3IJSW
— The Khel India Cricket (@TKI_Cricket) August 9, 2024
‘మే 4వ తేదీ లేదా అంతకంటే ముందుగానే జాధవ్‌కు పద్మ విభూషణ్ పురస్కారంపై సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తున్నాం. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాధవ్‌కు పద్మ విభూషణ్ పురస్కారంపై గడువులోపే కరసత్తు పూర్తి చేసి ప్రకటన చేయనుంది. విశ్వ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఒలింపిక్ విజేతలను కేంద్రం పద్మ పురస్కారాలతో గౌరవిస్తుంది. కానీ, జాధవ్‌కు మాత్రం మరణాంతరం కూడా ఈ అవార్డు దక్కకపోవడం శోచనీయం.