Chennai Super Kings : పంతొమ్మిదో సీజన్లో అంచనాలను ఏమాత్రం అందుకోలేక తీవ్రంగా నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings )కు మరో బిగ్ షాక్. పవర్ ప్లేలో చెలరేగుతూ చెన్నైకి బ్యాటింగ్ అస్త్రంగా మారిన ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గాయంతో టోర్నీకి దూరమయ్యేలా ఉన్నాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇబ్బంది పడిన మాత్రే.. 30 పరుగులకే ఔటయ్యాడు. తొడ కండరాల నొప్పితో నడవలేకపోయిన ఈ చిచ్చరపిడుగును సహాయక బృందం డగౌట్‌కు తీసుకెళ్లారు. మాత్రే ఆరోగ్యంపై స్పందించిన బ్యాటింగ్ కోచ్ ఆందోళన వ్యక్తం చేశాడు.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ నిర్దేశించిన 195 పరుగుల ఛేదనలో క్రీజులోకి వస్తూనే బౌండరీలతో చెలరేగాడు. హైదరాబాద్ పేసర్ ప్రఫుల్ హింగే ఓవర్లో ఐదు ఫోర్లతో చెలరేగాడీ హిట్టర్. అయితే.. రెండో పరుగు తీసే క్రమంలో అనూహ్యంగా ఎడమ కాలి కండరాలు పట్టేయడంతో మాత్రే ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి పరీక్షించినా అతడికి ఉపశమనం లభించలేదు. నితీశ్ ఓవర్లో క్లాసెన్ డైవింగ్ క్యాచ్‌తో ఔటైన మాత్రే.. నడవడానికి కష్టపడడంతో సహాయక సిబ్బంది చేయందించారు.
🔴 BAD NEWS FOR CHENNAI SUPER KINGS IN IPL 2026 ❌
Michael Hussey said🎙️- “Ayush Mhatre has hamstring tear, I don’t know how bad it is – we will have scan but it looks really bad unfortunately, could be big loss”.🤯pic.twitter.com/xq08lDxqgk
— Sam (@Cricsam01) April 19, 2026
‘డగౌట్లో మాత్రేను పరీక్షించిన బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ గాయం తీవ్రతపై స్పందించాడు. ఐపీఎల్‌కు మాత్రే దూరమయ్యేలా ఉన్నాడని, కొత్త బ్యాటర్‌ను తీసుకుంటామని అతడు తెలిపాడు. ‘కండరాల చీలిక వచ్చి ఉండవచ్చు.. ఆ గాయం తీవ్రత ఎంతలా ఉందనేది తెలియదు. ఒకట్రెండు రోజుల్లో మాత్రేకు స్కానింగ్ పరీక్ష చేయిస్తాం. ఒకవేళ గాయం తీవ్రత పెద్దదైతే అతడు టోర్నీకి దూరమవ్వడం ఖాయం.
Ayush Mhatre Da! 🔥
Dealing in 4s and 6s #WhistlePodu #SRHvCSK pic.twitter.com/2DfLvTjKKu— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2026
మాత్రే అందుబాటులో లేకపోవడం నిజంగా మాకు చెడు వార్త. అతడు చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు అతడు గాయపడినందున మరొకరికి అవకాశం ఇవ్వక తప్పదు. మూడో స్థానంలో ఆడేందుకు కొందరు ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తిగా ఉంది’ అని హుస్సే వెల్లడించాడు. మాత్రే గాయపడడంతో అతడి స్థానంలో ఉర్విల్ పటేల్ మూడో స్థానంలో ఆడే అవకాశముంది. పంతొమ్మిదో సీజన్లో రెండే విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన చెన్నై ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది.