Cristiano Ronaldo | అత్యధిక గోల్స్‌తో రికార్డు.. మారడోనా అవార్డుకు ఎంపికైన రొనాల్డో
Cristiano Ronaldo : పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ప్రతిష్ఠాత్మక అవార్డుకి ఎంపికయ్యాడు. 2023లో అత్యధికంగా 54 గోల్స్ కొట్టినందుకు మారడోనా(Maradona) అవార్డుకు ఎంపికయ్యాడు. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డ్స్(Dubai Globe Soccer Awards) పండుగలో జనవరి...
Cristiano Ronaldo : పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ప్రతిష్ఠాత్మక అవార్డుకి ఎంపికయ్యాడు. 2023లో అత్యధికంగా 54 గోల్స్ కొట్టినందుకు మారడోనా అవార్డు(Maradon Award)కు ఎంపికయ్యాడు. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డ్స్(Dubai Globe Soccer Awards) పండుగలో జనవరి 19వ తేదీన.. ఈ ఫార్వర్డ్ ప్లేయర్ బెస్ట్ గోల్ స్కోరర్ అవార్డును అందుకోనున్నాడు.
38 ఏండ్ల రొనాల్డో59 మ్యాచుల్లోనే 54 గోల్స్ సాధించాడు. ఈ స్టార్ ప్లేయర్ ఈ గతంలో ఐదు పర్యాయాలు టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు. 2011, 2013, 2014, 2015లో రొనాల్డో అత్యధిక గోల్స్ సాధించాడు. రొనాల్డోకు ఫ్రాన్స్ యువ కెరటం ఎంబాపే(Mbappe), ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్(Harry Kane)లతో పోటీ ఎదురైంది.
క్రిస్టియానో రొనాల్డో

కానీ, వాళ్లిద్దరూ.. 52 గోల్స్‌తో సంయుక్తంగా రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ యంగ్‌స్టర్ ఎర్లింగ్ హాలాండ్ 50 గోల్స్‌తో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు వరల్డ్ కప్ విజేత లియోనల్ మెస్సీ(Lionel Messi) మాత్రం 44 మ్యాచుల్లో 28 గోల్స్‌తో నిరాశపరిచాడు.
రొనాల్డో, లియోనల్ మెస్సీ

ఖతార్‌లో నిరుడు జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) రొనాల్డో కెరీర్‌ను మలుపుతిప్పిందనే చెప్పాలి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు ఇంగ్లండ్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాంచెస్టర్ యునైటెడ్(Manchester United) క్లబ్ యాజమాన్యం తీరును తప్పుపట్టాడు. దాంతో, మాంచెస్టర్ క్లబ్ రొనాల్డోతో ఒప్పంద్దం రద్దు చేసుకుంది. మెగా టోర్నీ అనంతరం ఈ స్టార్ ప్లేయర్‌ను అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. రెండున్నర ఏండ్ల కాలానికి రూ.4,400 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Captain Miller | ధనుష్ కెప్టెన్ మిల్లర్ సెన్సార్ అప్డేట్.. రన్ టైం ఎంతో తెలుసా..?
- Covid-19 New Symptoms | మళ్లీ జడలువిప్పుతున్న కరోనా..! ఈ రెండు లక్షణాలు సైతం కొవిడ్‌కు సంకేతమే..!
- MLA Arekapudi Gandhi | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం : ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

