RCB | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
RCB | ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవం సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించింది.
RCB | ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవం సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ జాతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ ఘటనపై ఇప్పటికే ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association), ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదైనన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ (quash criminal case) ప్రత్యేక పిటిషన్ వేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (ఆర్సీఎస్ఎల్) తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ అయిన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు తమపై దాఖలైన కేసును సవాల్ చేస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఇటీవలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్ణాటక హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులు, ప్రభుత్వానికి సూచించింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు సహకరించాలని, న్యాయస్థానం పరిధి దాటి ఎక్కడకు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని అర్జీదారులకు న్యాయస్థానం సూచించింది.
Also Read..
“Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. గాయపడిన వారికి నోటీసులు జారీ”
“తొక్కిసలాటతో నాకు సంబంధం లేదు..కర్ణాటక సీఎం సిద్ధరామయ్య”
“కేఎస్సీఏ కార్యదర్శి, కోశాధికారి రాజీనామా”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

