Manoj Tiwary | శ్రీమతికి ప్రేమలేఖ రాసిన బెంగాల్ క్రీడా మంత్రి.. సెంచరీ చేయగానే…
పశ్చిమ బెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. జార్ఖండ్ తో క్వాలిఫయర్స్ లో శతకం బాదిన ఈ వెటరన్ ఆటగాడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న సెమీస్ లో కూడా సెంచరీ చేశాడు. సెంచరీ చేయగానే జేబులోంచి ఓ లేఖను తీశాడు తివారి. అందులో అమాత్యుల వారి భార్య పేరుతో రాసి ఉన్న ప్రేమలేఖ దాగి ఉంది.
రంజీ ట్రోఫీ-2022లో భాగంగా ఏలూరు (ఆంధ్రప్రదేశ్)లో మధ్యప్రదేశ్-బెంగాల్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మధ్యప్రదేశ్ జట్టు 341 పరుగులకు ఆలౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన బెంగాల్.. 54 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మనోజ్ తివారి.. 211 బంతుల్లో 102 పరుగులు చేసి తమ జట్టును ఆదుకున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడే షాబాజ్ అహ్మద్ (116) తో కలిసి బెంగాల్ ను ముందుకు నడిపించాడు.
అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ చేయగానే తివారి.. తన జేబులో ఉన్న చీటిని తీసి కెమెరాల వైపు చూపాడు. అందులో ‘ఐ లవ్యూ సుస్మిత (మై స్వీటీపై)’ అని రాసి ఉంది. తివారి భార్య పేరు సుస్మిత. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రంజీలలో మనోజ్ కు ఇది 29వ సెంచరీ కావడం విశేషం.
అయితే తివారి సెంచరీ తర్వాత ఈ నోట్ చూపడంపై ట్విటర్ లో పలువురు ఆకతాయిలు ‘మరి అందులో మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం) పేరేది..? అయితే ఇతడు నిజమైన టీఎంసీ అభ్యర్థి కాదు..’, ‘నేను అతడు మమతా బెనర్జీకి లవ్ లెటర్ రాసాడేమో అనుకుంటున్నా’ అని కామెంట్లు చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పనేనని టీఎంసీ ఆరోపిస్తున్నది.
Manoj Tiwary shows a handmade note after scoring the century to appreciate his family. pic.twitter.com/Q51dSd5xkj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 16, 2022
Where is Mamata Banerjee’s name ?
Not a real tmc candidate imo— Em!N€nt $oC!@li$t (@NosaneEmi) June 16, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

