అమ్మ పుస్తకం అమ్మేందుకే రాహుల్ రాక!
రాహుల్‌గాంధీ భారత్ సమ్మిట్‌కు వచ్చి దేశ యువతకు దిశానిర్దేశం చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అన్ని స్థాయిల నేతలు ఊదరగొట్టారు. కానీ ఆయన మాత్రం తన తల్లి సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకం ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్ నేతలే చెప్పుకొంటున్నారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే తెలంగాణ ఉద్యమ ప్రస్తావనే లేని సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని రాష్ట్రానికి అంటగట్టే ఆలోచనతోనే రాహుల్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
- సోనియా ఆత్మకథ ప్రచారానికే ప్రాధాన్యం
- తెలంగాణ ఊసేలేని బయోగ్రఫీని ప్రజలకు అంటగట్టే యత్నం
హైదరాబాద్ , నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాహుల్‌గాంధీ భారత్ సమ్మిట్‌కు వచ్చి దేశ యువతకు దిశానిర్దేశం చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అన్ని స్థాయిల నేతలు ఊదరగొట్టారు. కానీ ఆయన మాత్రం తన తల్లి సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకం ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్ నేతలే చెప్పుకొంటున్నారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే తెలంగాణ ఉద్యమ ప్రస్తావనే లేని సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని రాష్ట్రానికి అంటగట్టే ఆలోచనతోనే రాహుల్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
భారత్ సమ్మిట్, గిగ్ వరర్ల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్‌రెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కొందరు మంత్రులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మూడేండ్ల కాంగ్రెస్ పాలనపై సమీక్ష జరుగుతుందని అందరూ భావించారు. మహేశ్ గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో పాలన, పార్టీ పనితీరు, నేతల మధ్య వివాదాలపై సమగ్ర నివేదిక సమర్పించి వచ్చారని, ఈ నేపథ్యంలో కీలక చర్చ ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూశారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై స్పష్టత వస్తుందని అనుకున్నారు.
కానీ రాహుల్ మాత్రం రాష్ట్ర రాజకీయాల కంటే సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంపైనే ఎకువగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సమ్మిట్‌కు వచ్చిన దేశ, విదేశీ ప్రతినిధులందరికీ పుస్తకాన్ని అందజేశారా? అని ఆరా తీసినట్టు సమాచారం. మరో మూడు నెలల్లో తెలుగు ఎడిషన్ వస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు దాన్ని చేరవేయాలని సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పుస్తకాలు కొనుగోలు చేసి ఇతరులకు బహుమతిగా ఇవ్వాలని దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు. దీంతో రాహుల్ పర్యటనలో భారత్ సమ్మిట్ కంటే సోనియా బయోగ్రఫీ ప్రచారానికే ప్రాధాన్యం ఉన్నదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
తెలంగాణ ఊసెత్తని ఆత్మకథ
సోనియా బయోగ్రఫీ ఈ నెల 10న మారెట్లోకి వచ్చింది. 544 పేజీల ఈ పుస్తకంలో ఇటలీలో సోనియా బాల్యం, కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహం, నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఆమె జీవితం, ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ మరణం, అనంతరం కాంగ్రెస్ రాజకీయాల్లో ఆమె ప్రయాణం వంటి అంశాలను పొందుపరిచారు. అయితే సోనియా ఆత్మకథపై తెలంగాణలో ప్రధానంగా వ్యక్తమవుతున్న అభ్యంతరం రాష్ట్ర ప్రస్తావన లేకపోవడమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను కాంగ్రెస్ ఎంతోకాలంగా ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవానికి.. 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని తన రాజకీయ ఎజెండాలో చేర్చింది.
యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటుపై తాత్సారం చేసింది. చివరికి కేసీఆర్ దీక్షకు పూనుకొని చావు అంచుల దాకా వెళ్లడం, గత్యంతరం లేని పరిస్థితుల్లో 2009 డిసెంబర్ 9న ప్రకటన చేయడం తెలిసిందే. ఆ తర్వాత సీమాంధ్రలో ఉద్యమాలు, శ్రీకృష్ణ కమిటీ, చివరకు 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం వరకు అనేక కీలక ఘట్టాలు జరిగాయి. కానీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, ఆమె చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుంటారు. కానీ సోనియాగాంధీ మాత్రం ధైర్యంగా ఆ విషయాన్ని చెప్పుకోలేకపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

