కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తనకున్న సుదీర్ఘ నేపథ్యాన్ని మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ గుర్తుకు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానల్‌తో గంభీర్ మాట్లాడుతూ ‘కోల్‌కతాతో 2011లో నా అనుబంధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడి అభిమానులతో ఉన్న అనుబంధం మరువలేనిది. సరిగ్గా 13 ఏండ్ల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను కోల్‌కతాకు ఆడితే.. ఇక్కడి నుంచి వచ్చిన గంగూలీ పుణెకు ఆడాడు. దీంతో స్టేడియంలో ఓవైపు ఉదారంగు పులుముకుంటే మరోవైపు లేత నీలిరంగు జెర్సీలతో నిండిపోయింది. చారిత్రక విభజన తర్వాత బెంగాల్ రెండుగా విడిపోయిం దంటూ ప్రముఖ టెలీగ్రాఫ్ పత్రిక ప్రముఖంగా ప్రచురిం చింది’ అని పేర్కొన్నారు.