లండన్: ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్(Ben Stokes) రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక సంఖ్యలో సిక్స్‌లు(Sixers) కొట్టిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ దాటేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో స్టోక్స్ ఆ రికార్డును తిరగరాశాడు.
Historic moment – Ben Stokes has most sixes in Test cricket.pic.twitter.com/5UcXmKQm3W
— Johns. (@CricCrazyJohns) February 18, 2023
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు స్టోక్స్. దీంతో మెకల్లమ్ పేరిట ఉన్న 107 సిక్సర్ల రికార్డును మెకల్లమ్ అధిగమించేశాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్‌గా మెకల్లమ్ ఉండడం విశేషం.
బెన్ స్టోక్స్ 90 టెస్టుల్లో 36 యావరేజ్‌తో 5652 రన్స్ చేశాడు. దాంట్లో 12 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టోక్స్, మెకల్లమ్ తర్వాత స్థానాల్లో గిల్‌క్రిస్ట్(100), క్రిస్ గేల్(98), జాక్వస్ కలిస్(97)లు ఉన్నారు.