లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్‌లో డర్హమ్ స్టార్ బ్యాటర్ స్టోక్స్ (88 బంతుల్లో 161) పరుగుల వరద పారించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్.. వోర్సెస్టర్షైర్ బౌలర్లను ఊచకోత కోశాడు. తన ఇన్నింగ్స్‌లో 88 బంతులు ఎదుర్కొన్న ఈ హార్డ్‌హిట్టర్ ఏకంగా 17 సిక్స్‌లు, 8 ఫోర్లతో చెలరేగాడు. బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ మైదానం నలువైపులా బౌండరీలతో హోరెత్తించిన స్టోక్స్‌తో పాటు డేవిడ్(135),డిక్సన్(104) సెంచరీలతో డర్హమ్ తొలి ఇన్నింగ్స్‌లో 580/6 డిక్లేర్ చేసింది.