లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. సీనియర్ క్రికెటర్ జో రూట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగడంతో ఏర్పడిన ఖాళీని స్టోక్స్‌తో భర్తీ చేశారు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)..స్టోక్స్‌కు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
దీనిపై ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్కీ స్పందిస్తూ ‘స్టోక్స్‌కు బాధ్యతలు అప్పగించేందుకు పెద్దగా ఆలోచించలేదు. భవిష్యత్‌లో అతడు జట్టును విజయపథంలో నడుపుతాడన్న నమ్మకం మాకుంది’ అని అన్నాడు. మరోవైపు టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన స్టోక్స్ మాట్లాడుతూ ‘ఇంగ్లండ్‌కు నాయకత్వం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నా..జాతీయ జట్టుకు రూట్ అందించిన సేవలకు కృతజ్ఞతలు. నా కెరీర్ అభివృద్ధిలో రూట్‌ది కీలక పాత్ర’ అని చెప్పుకొచ్చాడు.