ఢిల్లీ: నిరుడు ఐపీఎల్ వేలంలోకి వచ్చినా సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీకి హ్యాండిచ్చి రెండేండ్ల నిషేధానికి గురైన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాదిరిగానే అదే దేశానికి చెందిన మరో క్రికెటర్ బెన్ డకెట్ కూడా క్యాపిటల్స్‌కు షాకిచ్చాడు. మరో మూడు రోజుల్లో టోర్నీ ఆరంభమవుతుందనగా అతడు ఈ సీజన్ నుంచి ఉన్నఫళంగా వైదొలిగాడు.
డకెట్.. టెస్టు జట్టులో స్థానం నిలుపుకునేందుకు గాను ఐపీఎల్ కంటే ఇంగ్లండ్ కౌంటీల్లోనే ఆడాలని నిశ్చయించుకున్నాడు.