IPL 2026: ఆ సన్‌గ్లాస్‌లు వద్దు.. ఐపీఎల్ క్రికెటర్లకు బీసీసీఐ కొత్త ఆంక్షలు
IPL 2026: ఐపీఎల్ క్రికెటర్లకు కొత్త ఆంక్షలు విధించింది బీసీసీఐ. స్మార్ట్ సన్‌గ్లాస్‌లు వాడరాదు అని బీసీసీఐ తన వార్నింగ్‌లో తెలిపింది. ఆ సన్గ్లాస్లతో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ చేసే అవకాశం ఉందని, అందుకే వాటిని బ్యాన్ చేస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది.
ముంబై: ఐపీఎల్(IPL 2026) క్రికెటర్లకు కొత్త ఆంక్షలు విధించింది బీసీసీఐ. ఈ సీజన్లో ఇంకా రెండు మ్యాచ్‌లో మిగిలి ఉన్నాయి. ఇవాళ రాజస్థాన్, గుజరాత్ మధ్య ఎలిమినేటర్ 2 మ్యాచ్ జరగనున్నది. ఇక ఇవాళ్టి విజేతతో ఆదివారం ఆర్సీబీ ఫైనల్ ఆడుతుంది. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ ఓ కీలక ఆదేశం ఇచ్చింది. ఆటగాళ్లు కానీ, మ్యాచ్ అఫీషియల్స్ కానీ స్మార్ట్ సన్‌గ్లాస్‌లు వాడకూడదని ఆదేశించింది.
కొత్తగా వస్తున్న స్మార్ట్ సన్గ్లాస్ల్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఫీచర్లు ఉన్నాయని, వాటితో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ పేర్కొన్నది. మొబైల్ డేటా లేదా వైఫై నెట్‌వర్క్‌తో స్మార్ట్ సన్‌గ్లాస్‌లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ తన హెచ్చరికలో తెలిపింది.
కొన్ని స్మార్ట్ సన్‌గ్లాస్ కంపెనీలు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో మార్కెటింగ్ చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో వాటి వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది. స్మార్ట్ సన్‌గ్లాస్‌లను ఆడియో-వీడియో రికార్డింగ్ డివైస్‌గా భావిస్తున్నామని బీసీసీఐ తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

