BCCI | ‘ఒలింపిక్ బృందానికి 8.5 కోట్లు’.. బీసీసీఐ సెక్రటరీ జై షా
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి తన ఉదారత చాటుకుంది. పొట్టి ప్రపంచ కప్ విజేతలకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ (BCCI ) ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లలో ఉత్సాహం నింపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి తన ఉదారత చాటుకుంది. పొట్టి ప్రపంచ కప్ విజేతలకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ (BCCI ) ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లలో ఉత్సాహం నింపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల్లో పోటీపడుతున్న ఆటగాళ్లకు ఆర్ధిక సాయంగా భారత ఒలింపిక్ సంఘా(IOA)నికి రూ.8.5 కోట్లు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆదివారం బీసీసీఐ సెక్రటరీ జై షా (Jai Shah) ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
‘ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి బీసీసీఐ ఆర్థిక సాయం చేస్తోందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా. విశ్వ క్రీడల సందర్భంగా భారత ఒలింపిక్ సంఘానికి రూ.8.5 కోట్లు అందజేస్తున్నాం. మెగా టోర్నీలో తలపడనున్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్. భారతదేశం గర్వపడేలా చేయడం. జై హింద్’ అని షా తన ఎక్స్ ఖాతా పోస్ట్‌లో అన్నాడు.
I am proud to announce that the @BCCI will be supporting our incredible athletes representing #India at the 2024 Paris Olympics. We are providing INR 8.5 Crores to the IOA for the campaign.
To our entire contingent, we wish you the very best. Make India proud! Jai Hind! 🇮🇳…
— Jay Shah (@JayShah) July 21, 2024
నిరుడు ఆసియా క్రీడల్లో పతక వందనం చేసిన భారత బృందం ఒలింపిక్స్‌లోనూ మెరిసేందుకు సిద్ధమైంది. ఈసారి 117 మందితో కూడిన స్క్వాడ్ ప్యారిస్‌కు వెళ్లింది. ఇందులో 47 మంది మహిళలు, 70 మంది పురుషులు ఉన్నారు. ట్రాక్ విభాగంలోనే అత్యధికంగా 29 మంది పోటీ పడుతుండగా.. 21 మంది షూటర్లు ఒలింపిక్ పతకంపై గురి పెట్టారు. జూలై 26వ తేదీన ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి
- Chandrayaan-3 | ఇస్రో ‘చంద్రయాన్-3’కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు.. ప్రకటించిన ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్..!
- ENG vs WI | ఇంగ్లండ్ ఆలౌట్.. విండీస్ లక్ష్యం ఎంతంటే..?
- Nagon Express | నాగోన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- HS Prannoy
- IOA
- Jai Shah
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

