లండన్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన కొత్త రోల్నూ సమర్థంగా పోషిస్తున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కామెంటరీ ఇచ్చిన అతడు.. తాజాగా ఇంగ్లండ్, శ్రీలంక వన్డే సిరీస్ కోసం కూడా స్కై స్పోర్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండు టీమ్స్ మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా అతడు చేసిన కామెంటరీ ఇప్పుడు నవ్వు తెప్పిస్తోంది. సాధారణంగా ఇండియన్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇంగ్లండ్ టీమ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌లాంటి వాళ్లు కామెంటరీలోనూ సరదా విషయాలు మాట్లాడుతూ నవ్వు తెప్పిస్తుంటారు.
ఇప్పుడు కార్తీక్ కూడా అలాంటి కామెంటరీతో ఆకట్టుకున్నాడు. బ్యాట్స్‌మెన్, బ్యాట్ల మధ్య రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కార్తీక్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్లు నచ్చకపోవడం అన్నది చాలా కామన్. ఎప్పుడూ జరిగేదే. చాలా మంది బ్యాటర్లకు తమ బ్యాట్లు నచ్చవు. వాళ్లకు అవతలి బ్యాట్స్‌మన్ బ్యాట్ బాగా నచ్చుతుంది. ఒకవిధంగా బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి. అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయి అని కార్తీక్ అనడం విశేషం.
@DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n
— Jon Moss (@Jon_Moss_) July 1, 2021