మెహిదీపట్నం, ఆగస్టు 24: ఉత్తరాఖడ్లోని హల్దానీలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ టోర్నీలో హైదరాబాద్ యువ రెజ్లర్లు అదరగొట్టారు. బాలికల అండర్-13 విభాగంలో నూర్ ఫాతిమా కాంస్య పతకంతో మెరువగా, బాలుర అండర్-11 కేటగిరీలో అబ్దుల్ బాసిద్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన ఈ అక్కాతమ్ముళ్ల ప్రతిభకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో రెజ్లింగ్ కోచ్ సుధాకర్ దగ్గర వీరిద్దరు ప్రస్తుతం కోచింగ్ తీసుకుంటున్నారు.