Messi-Barcelona | మెస్సీ కోసం.. ఆ ఇద్దరిని వదులుకోనున్న బార్సిలోనా..!
వరల్డ్ కప్ హీరో, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi)తో మళ్లీ ఒప్పందం చేసుకునేందుకు బార్సిలోనా క్లబ్(Barcelona) సిద్ధపడుతోంది. అతడిని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ స్టార్ ఆటగాడి కోసం ఇద్దరు ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు ఆ క్లబ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
Messi-Barcelona : వరల్డ్ కప్ హీరో, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi)తో మళ్లీ ఒప్పందం చేసుకునేందుకు బార్సిలోనా క్లబ్(Barcelona) సిద్ధపడుతోంది. అతడిని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ స్టార్ ఆటగాడి కోసం ఇద్దరు ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు ఆ క్లబ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఫార్వర్డ్ ప్లేయర్స్ రఫిన్హా, అన్సూమనే ఫతీలను ఇతర క్లబ్స్‌కు అమ్మాలని అనుకుంటోందట.
ప్రస్తుతం మెస్సీ పీఎస్జీ క్లబ్(PSG)కు ఆడుతున్నాడు. ఆ జట్టు ఛాంపియన్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ క్లబ్‌తో అతడి కాంట్రాక్టు ఈ జూన్‌లో ముగుస్తుంది. దాంతో, ఈ స్టార్ ప్లేయర్‌తో ఒప్పందం చేసుకునేందుకు పలు ఫుట్‌బాల్ క్లబ్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకని మెస్సీని తిరిగి తమ క్లబ్‌కు ఆడించాలని బార్సిలోనా పావులు కదుపుతోంది. ఈ లెజెండరీ ఫుట్‌బాలర్ 2004లో బార్సిలోనాకు ఆడాడు.
ఎనిమిదేళ్ల నిరీక్షణ
ఫుట్‌బాల్ ఆటలో దిగ్గజంగా పేరొందిన మెస్సీ వరల్డ్ కప్ కల గత ఏడాది నెరవేరింది. ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్ (FIFA world cup) ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా 4-2తో గెలుపొందింది. దాంతో, మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టాడు. మొత్తంగా టోర్నమెంట్లో ఏడు గోల్స్ సాధించాడు. 2014లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫైనల్ చేరింది. కానీ, జర్మనీ కప్పు ఎగరేసుకుపోయింది. దాంతో, వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడడం కోసం మెస్సీ ఎనిమిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
Virat Kohli | ఆమెతో డేటింగ్.. నా జీవితాన్ని మార్చేసింది : కోహ్లీ
Mumbai Indians | మహానగరాన్ని తలపించేలా ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

