కింగ్స్టన్: వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు 15 ఏండ్ల తర్వాత చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. విండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో బంగ్లా 101 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకుంది. బంగ్లా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 185 పరుగులకే కుప్పకూలింది.
తైజుల్ ఇస్లాం(5/50) ధాటికి విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కొవెమ్ హాడ్జ్(55), కెప్టెన్ క్రేగ్ బ్రాత్‌వైట్(43) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. హసన్, తస్కిన్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌స్కోరు 193/5తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లా 268 పరుగులు చేసింది. జాకెర్ అలీ(91) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.