Dhaka Test | సవాల్ విసిరి చతికిలబడిన పాకిస్థాన్.. తొలి విజయంతో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..!
Dhaka Test : సొంతగడ్డపై తామెంత ప్రమాదకరమో బంగ్లాదేశ్(Bangladesh) జట్టు మరోసారి నిరూపించింది. తొలి టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లను వణకిస్తూ భారీ విజయాన్నందుకుంది.
Dhaka Test : సొంతగడ్డపై తామెంత ప్రమాదకరమో బంగ్లాదేశ్ (Bangladesh) జట్టు మరోసారి నిరూపించింది. తొలి టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లను వణకిస్తూ భారీ విజయాన్నందుకుంది. ‘దమ్ముంటే మా ముందు దమ్ముంటే మా ముందు 70 ఓవర్లలో 260పైగా లక్ష్యాన్ని నిర్దేశించండి’ అని సవాల్ విసిరిన సల్మాన్ అఘా(Salman Agha) తల పొగరను అణచివేస్తూ రెండు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదటి ఇన్నింగ్స్‌లో కాస్తో కూస్తో పోరాడిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కుప్పకూలింది. నహిద్ రానా (5-40) బంతితో చెలరేగిన వేళ బంగ్లా 104 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా స్వదేశంలో పాక్‌పై బంగ్లాదేశ్ మొదటి విజయంతో చరిత్ర సృష్టించింది.
ఢాకా టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ ధాటికి పాకిస్థాన్ నిలువలేకపోయింది. 268 పరుగుల స్వల్ప ఛేదనలో బ్యాటర్ల వైఫల్యంతో పాక్ కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో నహిద్ రానా(5-40) ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ విజయంలో కీలకమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడిన పాక్ ఆటగాళ్లు ఏమోందో ఏమో రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు.
Nahid Rana cleans up Mohammad Rizwan as Bangladesh close in on victory 🔥
(via @BCBtigers) #BANvPAK pic.twitter.com/uW6ptLjLvx
— ESPNcricinfo (@ESPNcricinfo) May 12, 2026
టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట అబ్దుల్లా ఫజల్(66) ఒక్కడే అర్ధ శతకంతో పోరాడాడు. కానీ, నహిద్ సంచలన స్పెల్‌తో పాక్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ శతకంతో.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన బంగ్లా కెప్టెన్ శాంటో ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
శాంటో సెంచరీ..
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న నజ్ముల్ హుసేన్ శాంటో(103) సెంచరీతో కదం తొక్కాడు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(71) మెరుపులతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా సాగింది. కానీ, మొహమ్మద్ అబ్బాస్(92-5) ఐదు వికెట్లు తీసి బంగ్లాను 413కే పరిమితం చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ కూడా దీటుగానే బదులిచ్చింది.
Bangladesh have won each of their last three Tests against Pakistan 🔥 pic.twitter.com/Z1mNFwO5BR
— ESPNcricinfo (@ESPNcricinfo) May 12, 2026
ఓపెనర్ అజాన్ అవైస్(103), అబ్దుల్లా ఫజల్(87), సల్మాన్ అఘా(58), మహమ్మద్ రిజ్వాన్(59)లు అర్ధ శతకాతో రాణించినా.. మెహిదీ హసన్ మిరాజ్(5-102) ధాటికి 386కే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో శాంటో అర్ధ శతకంతో ఆదుకోగా బంగ్లా 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇరుజట్ల మధ్య మే 16 నుంచి రెండో టెస్టు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

