Jahanara Alam : మహిళా క్రికెట్లో సంచనలం రేపుతున్న బంగ్లాదేశ్ మాజీ పేసర్ జహనరా అలం (Jahanara Alam) వ్యాఖ్యలను బోర్డు, ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకున్నాయి. మూడేళ్ల క్రితం వరల్డ్ కప్ (T20 World Cup) సమయంలో సిబ్బంది ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె యూట్యూబ్ ఛానెల్లో ఆరోపించించిన నేపథ్యంలో దోషులను పట్టుకునేందుకు సిద్దమైంది. జహనరాకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ యువత భగ్గుమనడంతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బాధితురాలైన జహనరాతో పాటు ఆమెను వేధించిన వ్యక్తిని విచారించి.. పదిహేను రోజుల్లో నివేదికను సమర్పించనుంది.
మూడేళ్ల క్రితం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పలువురు సహాయక సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ పేసర్ చేసిన ఆరోపణలను సిరీయస్‌గా తీసుకున్నాం. ఇది సున్నితమైన విషయం కావడంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ వ్యవహారంపై లోతుగా విచారించి.. పదిహేను రోజుల్లో నివేదికను కమిటీ అందజేయనుంది అని శుక్రవారం ఒక ప్రకటనలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అంతేకాదు జహనరాకు అన్ని విధాల అండగా ఉంటామని క్రీడా సలహాదారు అసిఫ్ మహమూద్ షోజిబ్ భుయైన్(Asif Mahmud Shojib Bhuyain) పేర్కొన్నాడు.
Bangladesh Cricket Board has launched an inquiry after ex-captain Jahanara Alam accused both current and former board officials of sexual harassment.
Details: https://t.co/kTzQyWHGfi pic.twitter.com/2Nt8kjRWoM
— Sportstar (@sportstarweb) November 7, 2025
‘మహిళా అథ్లెట్లు, క్రీడాకారుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఎవరైనా వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపాడు. లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన జహనరాతో మాట్లాడుతాను. ఆమెకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తా. మహిళల్ని వేధించడం నేరం కనుక.. ప్రభుత్వ పరంగా ఆమెకు అండగా ఉంటాం. వేధింపులకు పాల్పడిన వ్యక్తులకు కఠినమైన శిక్ష విధిస్తాం’ అని అసిఫ్ చెప్పాడు. అయితే.. జహనరాను వేధించిన వాళ్లు ప్రస్తుతం బంగ్లా బోర్డులో కీలక స్థానాల్లో ఉన్నారు. వీరిలో మాజీ పేసర్ మంజురుల్ అలామ్ ఒకడు. మహిళా క్రికెట్ సెలెక్టర్ అయిన అతడు చైనాలో ఇప్పుడు నివసిస్తున్నాడు.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ గురించి మాజీ పేసర్ జహనరా ఆలం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న నిగర్ సుల్తానా జూనియర్లను తన గదికి పిలుపించుకొని కొడుతుందని ఆరోపించింది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ నిగర్ తమను కొట్టిందని జూనియర్లు తనతో చెప్పారని జహనరా చెప్పింది. అంతేకాదు.. మూడేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఆమె మాట్లాడింది.
Former Bangladesh skipper Jahanara Alam, who took a break from cricket due to mental health reasons and is currently living in Australia, has made shocking claims of sexual harassment against the selector and manager, former pace bowler Manjurul Islam.#Cricket #CricTracker pic.twitter.com/pkVmtIGNUn
— CricTracker (@Cricketracker) November 7, 2025
‘న్యూజిలాండ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో మాజీ పేసర్ మంజురుల్ ఇస్లాం మాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతడు మమ్మల్ని తన ఛాతికి దగ్గరగా లాక్కొనేవాడు. అంతేకాదు తన నోటిని మా చెవుల దగ్గర పెడుతూ చాలా ఇబ్బందికి గురిచేశాడు. మీ పీరియడ్ పూర్తికాగానే నాతో చెప్పండి. అప్పుడు నావైపు చూడండి అని అతడు మాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు’ అని జహనరా యూట్యూబ్ ఛానెల్లో భోరుమంది. పేసర్‌గా 2011లో అరంగేట్రం చేసిన జహనరా 2022లో వీడ్కోలు పలికింది.