టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే.. బంగ్లాదేశ్‌ను ఆస్ట్రేలియా తమ టఫ్ బౌలింగ్‌తో ఈజీగా కట్టడి చేస్తోంది. దీంతో 11 ఓవర్లకే బంగ్లా 7 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు కూడా పెద్దగా ఆడలేకపోయారు.
మహమ్మద్ నయిమ్ అయితే 16 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లిటన్ దాస్ డక్ అవుట్ అయ్యాడు. సౌమ్య సర్కార్ 8 బంతుల్లో 5 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రహీమ్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. షమిమ్ హొస్సేన్ 18 బంతుల్లో 19 పరుగులు చేశౄడు. మహెది హసన్ డక్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజుల్లో కెప్టెన్ మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ ఉన్నారు. 12 ఓవర్లకు బంగ్లాదేశ్ 7 వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది.
ఇక.. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. జొష్.. 2 ఓవర్లు వేసి 8 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్ 2 ఓవర్లు వేసి 6 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు. పాట్ కమిన్స్ 2 ఓవర్స్ వేసి 13 పరుగులు ఇచ్చాడు. ఆడమ్ జంపా.. 3 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.