ఢిల్లీ: సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు జరుగుతున్న అడిలైడ్ ఇంటర్నేషనల్‌లో భారత, మెక్సికన్ ద్వయం శ్రీరామ్ బాలాజీ-రెయెస్ వరెలా ప్రిక్వార్టర్స్‌కు చేరింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బాలాజీ-వరెలా జోడీ.. 4-6, 6-2, 10-7తో రోహన్ బోపన్న (భారత్)-నికోలస్ (కొలంబియా)ను ఓడించింది. ఇక అక్లాండ్ ఏఎస్‌బీ క్లాసిక్‌లో భారత సింగిల్స్ ఆటగాడు సుమిత్ నాగల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.