IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(36 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. అయితే.. స్టోయినిస్ బౌలింగ్‌లో ఫుల్‌షాట్ కొట్టబోయి రోహిత్ శర్మ(8) ఔటయ్యాక జోరు పెంచిన జానీ.. బౌండరీలతో హోరెత్తిస్తున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, , అజ్ముతుల్లా ఓవర్లో ఒక సిక్సర్ బాదిన అతడు తిలక్ వర్మ(14 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 46 రన్స్ జోడించాడు. దాంతో, పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 10.83 స్ట్రయిక్ రేటుతో 65 పరుగులు చేసింది.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆడింది. జేమీసన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(36 నాటౌట్) సిక్సర్ బాదగా.. ఆ తర్వాత ఓవర్‌ను అయ్యర్ తెలివిగా స్టోయినిస్‌తో వేయించాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన అతడు.. రెండో బంతికి ఫుల్ షాట్ ఆడి.. బౌండరీ లైన్ వద్ద విజయ్‌కుమార్ చేతికి చిక్కాడు. 4 పరుగుల వద్ద లైఫ్ లభించిన హిట్‌మ్యాన్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.
An eventful start in Ahmedabad 😮
Rohit Sharma walks back as #PBKS strike early ☝
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/HVrx4MvLB0
— IndianPremierLeague (@IPL) June 1, 2025