హైదరాబాద్, ఆట ప్రతినిధి: అత్యుత్తమ నాణ్యత కల్గిన బ్యాడ్మింటన్ పరికరాల కోసం ప్రత్యేక ఆన్లైన్ స్టోర్ ప్లేయర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్యాడ్మింటన్హబ్. ఇన్ (Badmintonhub.in) పేరుతో ఆన్లైన్ స్టోర్‌ను జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ ప్లేయర్లు తమ క్రీడా పరికరాల అవసరాల కోసం వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తున్నది. గత కొంత కాలంగా ప్రతీది ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు విశ్వసనీయమైన ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ లేదు. అటువంటి లోటును తీర్చేందుకు బ్యాడ్మింటన్హబ్.ఇన్ ముందుకొచ్చింది.
దేశంలో మరింత మంది చాంపియన్లను తయారు చేసేందుకు ఇలాంటివి ఎంతగానో దోహదపడుతాయి’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో అఫ్రోజ్‌ఖాన్, రోనక్ సచ్దేవ్ పాల్గొన్నారు.