హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియా జూనియర్ ర్యాంకింగ్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సూర్య చరిష్మ, ధృవ్ విజేతలుగా నిలిచారు. మంగళవారం బాలికల అండర్-19 సింగిల్స్ ఫైనల్లో సూర్య చరిష్మ 11-21, 21-8, 21-18తో అలిషానాయక్పై గెలిచింది. మరోవైపు బాలుర అండర్-19 తుదిపోరులో ధృవ్ 21-16, 23-21తో గిన్పాల్పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి, అర్జున్‌రెడ్డి, పీసీఎస్రావు, శ్రీనివాస్‌రావు, బాబు హాజరయ్యారు.