హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహారాష్ట్ర వేదికగా జరుగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సౌత్‌జోన్ తైక్వాండో పోటీల్లో రాష్ర్టానికి చెందిన బాబులాల్ టెక్నికల్ డెలిగేట్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి 23 వరకు జరుగనున్న టోర్నీలో బాబుబాల్ సాంకేతిక ప్రతినిధిగా వ్యవహరించనున్నాడు. సీబీఎస్ఈ స్పోర్ట్స్ హెడ్ మజింత్సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.