Babar Azam: కెప్టెన్సీకి రిజైన్ చేసిన బాబర్ ఆజమ్
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నాడు. పరిమితి ఓవర్ల క్రికెట్‌కు .. సారథ్య బాధ్యతలు చేపట్టబోనని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకోవడం ఇది రెండోసారి.
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజమ్(Babar Azam) తప్పుకున్నాడు. పరిమితి ఓవర్ల క్రికెట్‌కు .. సారథ్య బాధ్యతలు చేపట్టబోనని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకోవడం ఇది రెండోసారి. కెప్టెన్సీ వదులుకున్న నేపథ్యంలో అతను ఎక్స్ అకౌంట్లో స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. పాకిస్థాన్ బోర్డుకు తన ఆలోచన గతంలోనే విన్నవించుకున్నట్లు చెప్పాడు. కెప్టెన్సీ వత్తిడి నుంచి బయటపడి.. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. గత నెలలోనే ఈ నిర్ణయాన్ని పీసీబీకి చెప్పినట్లు తెలిపాడు. పాక్ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
2023లో వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి తర్వాత కూడా బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా బాబర్ మొదటిసారి 2019లో బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 2020లో టెస్టు, వన్డే జట్లకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం రిజ్వాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 7 నుంచి ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ టెస్టు సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూరుకు వెళ్లనున్నది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నది. ఇక డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడనున్నది.
Dear Fans,
I’m sharing some news with you today. I have decided to resign as captain of the Pakistan men’s cricket team, effective as of my notification to the PCB and Team Management last month.
It’s been an honour to lead this team, but it’s time for me to step down and focus…
— Babar Azam (@babarazam258) October 1, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

