Babar Azam | పోలీసులకు దొరికిపోయిన పాక్ కెప్టెన్.. ఏం చేశాడంటే..?
Babar Azam : ప్రపంచ కప్(ODI World Cup 2023) కోసం పాకిస్థాన్ జట్టు(Pakistan Team)కు ఈరోజే భారత వీసా(Indian Visa) మంజూరు అయింది. దాంతో, దాయాది బృందం మరో రెండు రోజల్లో భారత్‌కు రానుంది. అయితే.. ఈ సమయంలోనే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam ) పోలీసులకు....
Babar Azam : ప్రపంచ కప్(ODI World Cup 2023) కోసం పాకిస్థాన్ జట్టు(Pakistan Team)కు ఈరోజే భారత వీసా(Indian Visa) మంజూరు అయింది. దాంతో, దాయాది బృందం మరో రెండు రోజల్లో భారత్‌కు రానుంది. అయితే.. ఈ సమయంలోనే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam ) పోలీసులకు దొరికిపోయాడు. అతివేగంతో కారు నడిపినందుకు అతడికి ఫైన్ వేశారు. అయితే.. ఎంత జరిమానా విధించారు? అనేది మాత్రం వెల్లడించలేదు.
బాబర్ తన తెలుపు రంగు ఆడీ కారు(Audi Car)లో హైవేపై అతివేగంగా దూసుకెళ్లాడు. పరిమితికి మించిన వేగంతో కారు నడుపుతున్న అతడిని పంజాబ్ వాహన పోలీసులు ఆపి, ఫైన్ రాశారు. బాబర్‌కు ఓ పోలీస్ అధికారి ఫైన్ వేస్తున్న ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
Babar azam fined due to over speeding on motorway.#BabarAzam𓃵 #motorwaypolice pic.twitter.com/1KTAMuL7uh
— Fæiz dawar (@davarfayz) September 25, 2023
ఇస్లామాబాద్‌లోని (Islamabad)లోని భారత దౌత్య కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పాక్ బృందానికి వీసా ఖరారు చేశారు. దాంతో, రెండు రోజుల్లో బాబర్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు, సహాయక సిబ్బంది ఇండియాకు రానున్నారు.

ప్రపంచ కప్ ముందు బాబర్ సేన రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం(Hyderabad uppal stadium)లో సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో, 30వ తేదీన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో ఎదురుపడనున్నాయి. అయితే.. ప్రపంచ కప్ చరిత్రలో దాయాదిపై టీమిండియాదే పైచేయిగా వస్తోంది. ఈసారి ఎవరు గెలుస్తారు? అనేది ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇవి కూడా చదవండి
ODI World Cup 2023 | పాక్ జట్టుకు వీసా మంజూరు.. రెండు రోజుల్లో హైదరాబాద్‌కు బాబర్ సేన
ODI World Cup 2023 | నంబర్ 1 జట్టుకే ట్రోఫీ.. టీమిండియాకు సెంటిమెంట్ కలిసొచ్చేనా!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

