Axar Patel: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అక్షర్ పటేల్.. వీడియో
Axar Patel : అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ అందుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ మార్ష్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. ఆ అద్భుత క్యాచ్ వీడియోను చూడండి.
గ్రాస్ ఐలెట్: అక్షర్ పటేల్( Axar Patel) కళ్లు చెదిరే క్యాచ్ పట్టేశాడు. అందర్నీ తన ఫీల్డింగ్‌తో స్టన్ చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కొట్టిన భారీ షాట్‌ను.. అక్షర్ పటేల్ గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో అందుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సూపర్8 స్టేజ్‌లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించిన మార్ష్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టాడు. అయితే డీప్ స్క్వేర్ లెగ్‌లోకి వెళ్లిన ఆ బంతి.. దాదాపు బౌండరీ మీదుగా వెళ్తున్నట్లు అనిపించింది.
కానీ బౌండరీ లైన్ సమీపంలో ఉన్న అక్షర్ పటేల్.. ఆ బంతిని గాల్లోకి ఎగిరి అక్షర్ తన కుడి చేతితో పట్టేశాడు. అద్భుతమైన రీతిలో అక్షర్ క్యాచ్ అందుకోవడంతో.. స్టేడియం ఒక్కసారిగా ఊగిపోయింది. ఆ క్యాచ్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఐసీసీ తన ఇన్‌స్టాలో ఆ వీడియోను పోస్టు చేసింది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 24 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. రోహిత్ శర్మ అత్యధికంగా 92 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా తన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 రన్స్ మాత్రమే చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

