పూణె: శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అటాకింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 31 బంతుల్లో అతను 65 రన్స్ స్కోర్ చేశాడు. దాంట్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇండియాను దాదాపు విక్టరీ దశకు చేర్చాడు. మరో బ్యాటర్ సూర్యకుమార్‌తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అక్షర్, సూర్య ఆరో వికెట్‌కు 91 రన్స్ జోడించారు. అయితే 14వ ఓవర్లో అక్షర్ తన విశ్వరూపం చూపాడు. వరుసగా మూడు సిక్సర్లతో చలరేగిపోయాడు. హసరంగ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే అక్షర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 16 రన్స్ తేడాతో శ్రీలంక విజయం సాధించింది. అక్షర్ బాదిన హ్యాట్రిక్ సిక్సర్ల వీడియో ఇదే.
axarpatel Back To Back 4 sixes 🇮🇳🏏
📷- Video- Star-sports
#axarpatel #INDvSL pic.twitter.com/CKm6Atgiya
— PawanKTRS🐯 (@PA1KTRS) January 5, 2023