వాషింగ్టన్: వాషింగ్టన్ ఓపెన్‌లో ఆస్ట్రేలియా చిన్నది డారియా సావిల్లె టాప్‌సీడ్‌కు షాకిచ్చింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సావిల్లె స్కోరుతో టాప్‌సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జెస్సికా పెగ్యులను ఇంటిదారి పట్టించింది. కాగా సీడెడ్ క్రీడాకారిణి సిమోన హలెప్, పురుషుల రెండో సీడ్ హ్యూబర్ట్ హర్కజ్ కూడా ఓటమి చవిచూశారు.
ప్రపంచ 88వ ర్యాంకర్ సావిల్లె వేడిమి, ఉక్క వాతావరణంలో టాప్ సీడ్‌కు చెమటలు పట్టించింది. 28 ఏళ్ల సావిల్లె ఇప్పటివరకు ఒకే డబ్ల్యుటిఎ టైటిల్ గెలుచుకుంది. సావిల్లె 98 నిమిషాలలో ఈ విజయాన్నందుకుంది. సావిల్లె క్వార్టర్ఫైనల్లో మారినోతో తలపడుతుంది. మారినో జర్మనీకి చెందిన ఆండ్రియా పెట్కోవిచ్పై 6-3, 3-6, 6-1 స్కోరుతో గెలుపొందింది.