మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు చుక్కెదురైంది. చాన్నాళ్లుగా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న స్వియాటెక్ ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. వరుసగా 37 మ్యాచ్‌లు నెగ్గిన స్వియాటెక్ 4-6, 4-6తో వింబుల్డన్ చాంపియన్, 22వ సీడ్ ఎలీనా రైబాకినా చేతిలో ఓడింది. వరుస సెట్లలో విజృంభించిన రైబాకినా.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది.
ఇతర మ్యాచ్‌ల్లో ఓస్టపెంకా, పెగులా, అజరెంక విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్‌కు పరాజయం తప్పలేదు. పురుషుల విభాగంలో సుదీర్ఘంగా సాగిన ప్రిక్వార్టర్స్ పోరులో సిట్సిపాస్ 6-4, 6-4, 3-6, 4-6, 6-3తో సిన్నెర్పై గెలువగా.. కొర్డా, కచనోవ్ కూడా విజయాలు సాధించి క్వార్టర్స్‌కు చేరారు. మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-డానిలీనా జంట రెండో రౌండ్లో ఓటమి పాలైంది.