న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని(Australian Deputy PM), రక్షణ మంత్రి రిచర్డ్ మార్లేస్.. ఇవాళ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు. ఇండియా టూర్లో ఉన్న ఆయన ఆదివారం రోజున అహ్మాదాబాద్‌లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. అయితే ఇవాళ ఉదయం ఆయన ఢిల్లీ ట్రిప్ వేశారు. నగరంలో ఉన్న ఫేమస్ ఫుడ్ స్టాల్స్‌కు వెళ్లారు. అక్కడ ఆయన రామ్ లడ్డూ తిన్నారు. నింబూ పానీ కూడా తాగారు. విరాట్ కోహ్లీ క్రికెట్ అకాడమీకి కూడా రిచర్డ్ వెళ్లారు. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. కోహ్లీ క్రికెట్ పాఠాలు ఇక్కడే నేర్చుకున్నారా, గల్లీ క్రికెట్ ఇక్కడే ఆడారా అని ఆయన అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Australian Deputy Prime Minister & Defence Minister Richard Marles eats ‘Ram Laddu’ from a stall, in Delhi pic.twitter.com/VgEcsIXsgn
— ANI (@ANI) November 20, 2023
#WATCH | Australian Deputy Prime Minister & Defence Minister Richard Marles drinks ‘Nimbu Pani’ from a stall for which the payment was done through UPI, in Delhi pic.twitter.com/tzYyL4m46L
— ANI (@ANI) November 20, 2023