పెర్త్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో సంచలన విజయం(Australia Won) నమోదు చేసింది. 205 రన్స్ టార్గెట్తో పెర్త్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో టార్గ్ట్ను అందుకున్నది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ శరవేగంగా సెంచరీ నమోదు చేశాడు. 69 బంతుల్లోనే సెంచరీ చేసిన హెడ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 83 బంతుల్లో 123 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. యాషెస్ సిరీస్లో తొలి టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. తొలి రోజు 19 వికెట్లు కూలిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఇంగ్లండ్ కేవలం 164 రన్స్కే రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ అయ్యింది.
A Travis Head masterclass pulls Australia to one of the most astounding #Ashes victories of all time!
All the action: https://t.co/9jWa4DVSnt pic.twitter.com/POC4UPbPS8
— cricket.com.au (@cricketcomau) November 22, 2025