బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ జరిగిన గ్రూప్ వన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 రన్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో ఆ గ్రూపులో రెండవ స్థానంలోకి వెళ్లింది ఆస్ట్రేలియా. 180 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 రన్స్‌కు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టకర్ అత్యధికంగా 71 రన్స్ చేశాడు.
Australia complete a fine win to keep semi-final hopes alive 💪#T20WorldCup | #AUSvIRE | 📝: https://t.co/CW4eQlDZGZ pic.twitter.com/WdUP4gLfZE
— ICC (@ICC) October 31, 2022
నిజానికి ఈ విక్టరీతో ఆస్ట్రేలియా కొంత నష్టాన్ని పూరించింది. ప్రస్తుతం గ్రూపులో ఆ జట్టు 5 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. రేపు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ కీలకంకానున్నది.
ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచినా.. ఆ జట్టులోని చాలా మంది సభ్యులకు గాయాలయ్యాయి. ఆరన్ ఫించ్ సగం మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయలేదు. టిమ్ డేవిడ్ పూర్తిగా గ్రౌండ్ బయటే ఉన్నాడు. స్టోయినిస్ అడపాదడపా వస్తూ వెళ్లిపోయాడు.