మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్ఇండియా వీలైనన్ని ఎక్కువ పొట్టి సిరీస్‌లు ఆడాలని భావిస్తున్నది. ఐపీఎల్ అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో పొట్టి ఫార్మాట్లో తలపడనుంది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్‌లో పర్యటించనున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాకున్నా.. అన్నీ ప్రధాన జట్లు పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో మునిగి ఉండటంతో సిరీస్ జరుగడం ఖాయంగా కనిపిస్తున్నది. అక్టోబర్-నవంబర్‌లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. అంతకుముందే సెప్టెంబర్‌లో కంగారూ జట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.