టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. వార్నర్ 33 బంతుల్లో 45 పరుగులు చేసి 4 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. ఆస్ట్రేలియా 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్.. 7 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్, మార్ష్ ఉన్నారు. మరోవైపు మార్ష్ కూడా చెలరేగి ఆడుతున్నాడు. 20 బంతుల్లో 30 పరుగులు చేసి 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు.
కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. టిమ్ సౌథీ రెండు ఓవర్లు, ఆడమ్ మిల్నే 2 ఓవర్లు, ఇష్ సోదీ 2 ఓవర్లు, సాంత్నర్ 2 ఓవర్లు వేశారు.
🔟 overs done.
— ICC (@ICC) November 14, 2021
Australia are in command of the run chase at 82/1.#T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/bKkec7P8IW