టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఇన్సింగ్స్ ముగియడంతో.. బ్యాటింగ్ బరిలోకి ఆస్ట్రేలియా దిగింది. ఓపెనర్లు.. డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరున్ ఫించ్.. బరిలోకి దిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. అయితే మూడో ఓవర్లోనే ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. బౌల్ట్ బౌలింగ్‌లో ఆరున్ ఫించ్.. మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 7 బంతుల్లో ఫించ్ కేవలం 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 11 బంతుల్లో 10 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో మార్ష్, వార్నర్ ఉన్నారు. మూడు ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 15 పరుగులు చేసింది.
New Zealand have their first ☝️
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
Boult sends Finch packing on 5.
An excellent catch from Mitchell. #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/cPlf9KMp2k