Davis Cup 2023 | ఫిన్లాండ్పై సూపర్ విక్టరీ.. డేవిస్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా
Davis Cup 2023 : ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్సీ పొపైరిన్(Alexei Popyrin) కీలక పోరులో సత్తా చాటాడు. సెమీఫైనల్లో అతడు అద్భుత విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్(Davis Cup 2023) ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 40వ ర్యాంకర్ అలెక్సీ.. ఒట్టో విర్టనెన్(ఫిన్లాండ్)పై గెలుపొందాడు. దాంతో, ఆసీస్ వరుసగా...
Davis Cup 2023 : ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్సీ పొపైరిన్(Alexei Popyrin) కీలక పోరులో సత్తా చాటాడు. సెమీఫైనల్లో అతడు అద్భుత విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్(Davis Cup 2023) ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 40వ ర్యాంకర్ అలెక్సీ.. ఒట్టో విర్టనెన్(ఫిన్లాండ్)పై గెలుపొందాడు. దాంతో, ఆసీస్ వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. నిరుడు కెనడా చేతిలో కంగుతిన్న ఆ జట్టు ఈసారి టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. డేవిస్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు 28-20 రికార్డు ఉండడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా (32-29) అగ్రస్థానంలో ఉంది.
టైటిల్ పోరులో ఆస్ట్రేలియా రెండో సెమీఫైనల్ ఈ మ్యాచ్ విజేతతో తలపడనుంది. సెమీస్‌లో ఇటలీ, సెర్బియా ఎదరుపడనున్నాయి. ఈ టోర్నీలో రికార్డు విజయాలు సాధించిన టాప్ సీడ్ జకోవిచ్ (సెర్బియా), జన్నిక్ సిన్నర్(ఇటలీ) మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఈవారంలోనే ఏటీపీ ఫైనల్స్‌లో జకో.. సిన్నర్‌ను చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏడో ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
Mlc Kavitha | కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీ నాయకులను నిలదీయాలి : ఎమ్మెల్సీ కవిత
-
Somnath | అంతరిక్ష రంగంలో అనవసర ఆంక్షలు వదిలించుకోవాలి..! : ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్
-
IPL 2024 | హైదరాబాద్, ఆర్సీబీ ఆటగాళ్ల మార్పిడి.. ఏ జట్టుకు ఎవరంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

