సిడ్నీ: 2018 కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ గురించి తమకు ముందు తెలియదని కమిన్స్ సహా ఆస్ట్రేలియా బౌలర్లు స్పష్టం చేశారు. ఆ మ్యాచ్‌లో తాను బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నట్టు మిగిలిన బౌలర్లకు ముందే తెలుసని బాన్‌క్రాఫ్ట్ ఇటీవల చెప్పడంతో ఆస్ట్రేలియా క్రికెట్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. దీంతో సాండ్‌పేపర్ గేట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా పునర్విచారణ చేపట్టింది. ఆ టెస్టు ఆడిన ఆసీస్ బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్ మంగళవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.