Cricket | ఇంగ్లండ్ వైట్‌వాష్.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
వర్షం కారణంగా అంపైర్లు మూడో వన్డేను 48 ఓవర్లకు కుదించారు
Cricket : మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌పై 221 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది. వర్షం కారణంగా అంపైర్లు మూడో వన్డేను 48 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (106), ట్రావిస్ హెడ్ (152) సెంచరీలతో చెలరేగడంతో 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. వీళ్లిద్దరూ రికార్డు స్థాయిలో 269 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 364 పరుగుల లక్ష్యం విధించారు. భారీ టార్గెట్‌ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ జేసన్ రాయ్ 33 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో, 31.4 ఓవర్లలో 142 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంతో సిరీస్‌ని గెలిచింది. ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. ఈమధ్యే వన్డే జట్టు పగ్గాలు చేపట్టిన కమిన్స్‌కు కెప్ట్‌న్‌గా ఇదే మొదటి సిరీస్ విజయం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

