కరార(గోల్డ్‌కోస్ట్): ఆస్ట్రేలియాతో గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న నాలుగో టీ20(AUSvIND)లో ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. ఫస్ట్ వికెట్‌కు అభిషేక్ శర్మ, గిల్ 56 రన్స్ జోడించారు. అభిషేక్ 28 రన్స్ చేసి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో మెరుగైన ఆట తీరును ప్రదర్శించిన గిల్.. హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. గిల్ 46 రన్స్ చేసి నిష్క్రమించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.
కెప్టెన్ సూర్య రెండు సిక్సర్లతో మెరిపించినా.. కేవలం 20 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన శివం దూబే కూడా 18 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్ సాయంతో 22 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో అక్షర్ 21 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ సిక్సర్, ఫోర్ ఉన్నాయి.
ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడం జంపాలు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు.
Nathan Ellis becomes just the fifth bowler to reach 50 T20I wickets for Australia 👏
Here’s a deeper look into the skill he brings to the game: https://t.co/9YXZCR5zGK pic.twitter.com/GsL5Tgq9ti
— cricket.com.au (@cricketcomau) November 6, 2025