డర్బన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు.. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఫెరీరా (48), మార్క్మ్ (41), హెన్రిక్స్ (42) రాణించారు.
కంగారూ బౌలర్లలో సీన్ అబాట్ 4, స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆసీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 191 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (91; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు. హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.