కింగ్స్టన్: వెస్టిండీస్‌తో జరిగిన మూడవ టెస్టులో ఆస్ట్రేలియా 176 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్నది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ అత్యంత దారుణంగా విఫలమైంది. కేవలం 27 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) చెలరేగిపోయాడు. జమైకా పిచ్‌పై నిప్పులు చెరిగాడు. 9 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను తీసుకున్నాడు. మరో ఆసీస్ పేసర్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే వెస్టిండీస్ అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది.
టెస్టు క్రికెట్లో 1955 తర్వాత ఓ జట్టు అత్యల్ప స్కోరుకు నిష్క్రమించింది. గతంలో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ 26 పరుగులకే ఆలౌటైంది. 2004లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ 47 రన్స్‌కు ఆలౌటైంది. ఆ తర్వాత మళ్లీ సోమవారం జమైకాలో తక్కువ స్కోరుకు నిష్క్రమించింది. వందో టెస్టు ఆడుతున్న మిచెల్ స్టార్క్ తన స్పీడ్‌తో దుమ్మురేపాడు. 9 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. 15 బంతుల్లోనే అతను అయిదు వికెట్లు తీసుకున్నాడు. చాలా వేగంగా అయిదు వికెట్లను తీసేశాడు. టెస్టు క్రికెట్లో 400 వికెట్ల మార్క్‌ను కూడా అతను దాటేశాడు.
సబినా పార్క్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 14.3 ఓవర్లలోనే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసింది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో 159 రన్స్ తేడాతో, గ్రెనిడాలో జరిగిన మ్యాచ్‌లో 133 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ హ్యాట్రిక్ మిస్సైనా.. అతని స్థానంలో బోలాండ్ ఆ ఫీట్ అందుకున్నాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన పదో ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచాడతను.
జూలై 21వ తేదీ నుంచి జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి.
Imposing, relentless and ever-present with ball in hand 😤
Mitchell Starc becomes the fourth Australian to reach 400 Test wickets thanks to another scintillating spell 🔥#WIvAUS 📲 https://t.co/7an5FwsUdF#WTC27 pic.twitter.com/yYVbvuyrux
— ICC (@ICC) July 14, 2025