Australia | బాక్సింగ్ డే టెస్టుకు యువ పేసర్ దూరం.. ఆస్ట్రేలియా స్క్వాడ్ ఇదే..!
Australia : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) అదరగొడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో పాక్ చిత్తుగా ఓడించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్ బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు...
Australia : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) అదరగొడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో పాక్ చిత్తుగా ఓడించిం 1-0 ఆధిక్యంలో నిలిచింది. అదే ఊపులో రెండో విజయంపై కన్నేసిన కమిన్స్ సేన బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు స్క్వాడ్‌ను ప్రకటించింది. అయితే.. మెల్బోర్న్ వేదికగా జరిగే ఈ టెస్టుకు 14 మందిని కాకుండా 13మందిని మాత్రమే ఎంపిక చేసింది.
తొలి టెస్టులో ఆడిన బౌలర్లను కొనసాగించాలనే ఉద్దేశంతో యువ పేసర్ లాన్సే మోరిస్(Lance Morris)ను స్క్వాడ్ నుంచి సెలెక్టర్లు తప్పించారు. దాంతో, మోరిస్ త్వరలోనే బిగ్‌బాష్ లీగ్(BBL)లో పెర్త్ స్కార్చర్స్ జట్టుతో కలువనున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసక శతకం బాదిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టులో స్థానం కాపాడుకున్నాడు. డిసెంబర్ 26న రెండో టెస్టు మొదలవ్వనుంది.
లాన్సే మోరిస్

ఆస్ట్రేలియా స్క్వాడ్ : ప్యాట్ కమిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్.
రెండో టెస్టు స్క్వాడ్‌లో ఒకరిని తగ్గించడంపై కమిన్స్ స్పందించాడు. ‘గాయాలు పెద్ద సమస్య అవుతాయని నేను అనుకోవడం లేదు. అందుకని తొలి టెస్టులో ఆడిన జట్టునే కొనసాగించాలని భావిస్తున్నాం. పెర్త్‌లో భారీ విజయం సాధించడంతో బౌలర్లంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఇది వేసవిలో టెస్టు సిరీస్‌లకు ఒక మంచి ఆరంభం’ అని కమిన్స్ తెలిపాడు. మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఇరుజట్లకు ఎనిమిది రోజుల విరామం దొరికింది. దాంతో మెల్బోర్న్ వెళ్లడానికి ముందు పాకిస్థాన్ ఒక వామప్ మ్యాచ్ ఆడనుంది.
ఇవి కూడా చదవండి
- Joe Biden | బైడెన్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. అమెరికా అధ్యక్షుడికి తప్పిన ముప్పు
- Dawood Ibrahim | అండర్ వరల్డ్ డాన్ ‘దావుద్ ఇబ్రహీం’పై విష ప్రయోగం.?
- Hyderabad | తార్నాకలో మహిళపై సామూహిక లైంగికదాడి.. నిందితుల అరెస్ట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

