Hyderabad | బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను బైక్ ఎక్కించుకున్నాడు.. తర్వాత ఏమైందంటే..
హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం చోటుచేసుకున్నది. బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను గమ్యస్థానంలో దింపుతానని చెప్పి.. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని తార్నాకలో (Tarnaka) దారుణం చోటుచేసుకున్నది. బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను గమ్యస్థానంలో దింపుతానని చెప్పి.. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి (Gang Rape) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ నగర్‌కు చెందిన బర్నే ఏసు మెకానిగ్కు పనిచేస్తున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి తన పని ముగించుకుని బైక్‌పై తార్నాక నుంచి ప్రశాంత్‌నగర్‌కు వెళ్తున్నాడు. ఈ తార్నాక బస్ స్టాప్‌లో బస్ కోసం వేచి ఉన్న మహిళను చూసిన అతడు.. బైక్ ఆపి ఆమెతో మాటలు కలిపాడు. ఆమెను లాలాపేటలో దింపుతానని చెప్పి తన వాహనంపై ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను మాటల్లోపెట్టి ప్రశాంత్‌నగర్‌లోని రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
అనంతరం తన నలుగురు స్నేహితులను అక్కడి పిలిపింది.. ఆమెపై సామూహిక అత్యచారం చేశారు. తర్వాత బాధితురాలిని తార్నాకలో వదిలి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

