Dawood Ibrahim | అండర్ వరల్డ్ డాన్ ‘దావుద్ ఇబ్రహీం’పై విష ప్రయోగం.?
Dawood Ibrahim | ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగింది. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అతడు ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Dawood Ibrahim | ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగింది. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించినట్లు.. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అతడు ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల న్యూస్ వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఏ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడనే విషయం బయటకు రాలేదు. మరోవైపు దావుద్పై విష ప్రయోగం చేసింది ఎవరని అతని సిబ్బంది ముమ్మరంగా గాలిస్తుంది.
దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ పఠాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్ గత కొంతకాలంగా కరాచీలోనే నివసిస్తున్నాడు.
1993 ముంబై పేలుళ్ల తర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా దావూద్ ఇబ్రహీంపై ముద్ర పడింది. 2003లో అమెరికా కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. గతేడాది తమ భూభాగంలోని 88 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించిన సందర్భంగా తొలిసారి దావూద్ తమ దగ్గరే ఉన్నాడని పాక్ అంగీకరించింది. అతన్ని తమకు అప్పగించాలని ఎన్నోసార్లు ఇండియా డిమాండ్ చేసినా పాక్ వినిపించుకోలేదు. ఇక అతడి కోసం ఇండియానే కాకుండా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు వెదుకుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

